‘తలైవర్ 170’ : ఆ ఇద్దరు హీరోయిన్స్ ఆన్ బోర్డు

Thalaivar170 1

ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్న తలైవర్ సూపర్ స్టార్ రజినికాంత్ ప్రస్తుతం తన కెరీర్ 170వ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీని జై భీం ఫేమ్ టీజె జ్ఞానవేల్ తెరకెక్కిస్తుండగా దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీలో కీలక పాత్రలకు యువ నటీమణులు అయిన దుషర విజయన్, రితిక సింగ్ లని తీసుకున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం వారిద్దరిని అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ ముఖ్య పాత్రలు చేస్తున్నట్లు టాక్. వీలైనంత త్వరగా ఈ మూవీ యొక్క షూటింగ్ పూర్తి చేసి దీనిని వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.

Exit mobile version