“నారప్ప” నుండి విడుదలైన తల్లి పేగు వీడియో సాంగ్!

Published on Sep 1, 2021 4:35 pm IST

విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన చిత్రం నారప్ప. ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అసురన్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటి గా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రేక్షకులకు, అభిమానులకు అందుబాటులో ఉంది. తాజాగా ఈ చిత్రం నుండి తల్లి పేగు పాటను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, కలైపులి ఎస్. తను మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :