మజిలీ కోసం అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమన్ !

Published on Mar 28, 2019 12:14 pm IST

నాగ చైతన్య , సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం మజిలీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక ఈచిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన అందించిన బీజీఎమ్ కొన్ని సంవత్సరాల పాటు గుర్తుండిపోతుందని చిత్ర డైరెక్టర్ శివ నిర్వాణ తెలిపారు.

ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ , సాంగ్స్ ప్రామిసింగ్ గా ఉండి సినిమా ఫై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 30న గ్రాండ్ గా జరుగనుంది. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More