మరో సారి తమన్ తో త్రివిక్రమ్ !

Published on Feb 27, 2019 8:49 am IST

జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. ఈ చిత్రం మార్చి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈసినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడట. అరవింద సమేత ఆల్బమ్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇంప్రెస్ అయినా త్రివిక్రమ్ మరో సారి తమన్ కే ఛాన్స్ ఇచ్చాడని సమాచారం.

కాగా అల్లు అర్జున్ కు రేసు గుర్రం , సరైనోడు వంటి మ్యూజికల్ హిట్స్ అందించిన తమన్ ఈసినిమా తో హ్యాట్రిక్ ఇస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం తమన్ టాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు.

సంబంధిత సమాచారం :