గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా నుంచి బాలయ్య బర్త్ డే ట్రీట్‌ను రెడీ చేస్తున్నారు మేకర్స్. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు ఉండటంతో, అభిమానుల కోసం ఈ చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్ ట్రీట్ రెడీ చేస్తోంది.
కాగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండటంతో ఈ ట్రీట్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, బాలయ్య కోసం థమన్ మరోసారి తనదైన రీతిలో ఓ బ్యాంగర్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్‌తో కలిసి థమన్ ఈ బ్యాంగర్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీనికి సంబంధించి ఓ ఫోటోను థమన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దీంతో బాలయ్య కోసం థమన్ ఎలాంటి బ్యాంగర్ తీసుకొస్తున్నాడా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.


