సాయితేజ్ హెల్త్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన థమన్.!

Published on Sep 30, 2021 10:00 am IST


సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తన లేటెస్ట్ చిత్రం “రిపబ్లిక్” ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు దేవాకట్ట తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది అనే సమయంలోనే సాయి తేజ్ కి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం జరిగింది. దీనితో సినీ వర్గాలు సహా అభిమాన వర్గాలు కూడా దిగ్బ్రాంతికి లోనయ్యాయి. ఇక ఆ తర్వాత తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తన కుటుంబీకులు సినీ వర్గాలు నుంచి బయటకు వచ్చాయి.

మరి ఇప్పుడు తేజ్ స్నేహితుడు టాలీవుడ్ ప్రెజెంట్ మ్యూజిక్ సెన్సేసన్ థమన్ కూడా ఒక అప్డేట్ ని ఇచ్చాడు. నా నన్బ(ఫ్రెండ్) సాయి తేజ్ ఇంకా నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అప్డేట్ ఇచ్చినందుకు సతీష్ బొట్టా కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొన్ని రోజుల్లోనే నా స్నేహితుడిని కలుస్తున్నందుకు ఎగ్జైటింగ్ గా ఉన్నానని” థమన్ కాస్త రిలీఫ్ ఇచ్చే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించాడు.

సంబంధిత సమాచారం :