అప్పుడు కొంచెం బాధగా అనిపించింది – తమన్‌

Published on Nov 29, 2021 11:10 pm IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా కొనసాగుతున్నాడు తమన్‌. కాగా తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన జర్నీ దగ్గర నుంచి తన జీవితంలో జరిగిన సంఘటనల వరకూ.. అలాగే తన మ్యూజిక్ ప్రయాణంలో జరిగిన అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తమన్ గతంలో ఓ పాట కోసం తానూ ఎంతో కష్ట పడ్డాను అని, కానీ.. అనుకున్నంత స్థాయి గుర్తింపు ఆ పాటకు రాలేదని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

తమన్ మాటల్లోనే.. ‘అరవింద సమేత’ ఆల్బమ్‌ లో ‘ఏడ పోయినాడో’ అనే పాట కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఎంతో వర్క్‌ చేశాను. నిజంగా అందులో విభిన్నమైన భావోద్వేగాలు ఉంటాయి. ఆ పాటకు తప్పకుండా మంచి గుర్తింపు వస్తుందనుకున్నాం. కానీ, ‘రెడ్డమ్మతల్లి’, ‘పెనివిటి’ పాటలకు వచ్చినంత ప్రశంసలు ఆ పాటకు రాలేదు. అప్పుడు కొంచెం బాధగా అనిపించింది’ అంటూ తమన్‌ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :