చిరు “లూసిఫర్” రీమేక్‌పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన తమన్..!

Published on Aug 12, 2021 8:06 pm IST

మెగస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో మళయాళంలో సూపర్ హిట్టైన “లూసిఫర్” సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ రీమేక్‌కి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సాలీడ్ రీమేక్‌కి తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల కిందట ఈ సినిమాకు మ్యూజికల్ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పిన తమన్ తాజాగా దీనిపై ఓ అప్డేట్‌ని ఇచ్చాడు.

ఈ సినిమాలో ఒక సాంగ్ రికార్డింగ్ పూర్తి చేశామని, మెగస్టార్ చిరంజీవి గారు స్వయంగా చెప్పిన విషెస్‌తో కూడిన పాట ఇదని, అభిమానిగా ఈ రోజు తన జీవితంలో మర్చిపోలేనిదని తమన్ ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చాడు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు మోహన్ రాజాకు ధన్యవాదాలు తెలిపాడు. ఇదే కాకుండా రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతున్నట్టు కూడా తమన్ తెలిపాడు.

సంబంధిత సమాచారం :