మహేష్ ఫ్యాన్స్ కోసం భారీ గిఫ్ట్ సిద్ధం..!

Published on Aug 7, 2020 7:27 am IST

ఆగస్టు 9న మహేష్ ఫ్యాన్స్ కి పండగ రోజు అని చెప్పాలి. ఆరోజున మహేష్ తన 45వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఇప్పటికే మహేశ్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి షురూ చేశారు. మహేశ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు సర్కారు వారి పాట మూవీ టీం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. మహేష్ వాయిస్ మెసేజ్ మరియు టైటిల్ ట్రాక్ విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ అప్ డేట్ ఇచ్చాడు. మహేశ్ బాబు ఓ మైక్ ముందున్న స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ మరో మూడు రోజుల్లో రెడీగా ఉన్నారా..? అంటూ ట్వీట్ చేశాడు.

మహేశ్ బాబు అభిమానులకు డైరెక్టర్ పరశురాం బెస్ట్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ను ఇవ్వనున్నారని స్పష్టమవుతుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More