ఇంటర్వ్యూ : తమన్ – ‘వెంకీ మామ’ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ !

Published on Dec 3, 2019 2:18 pm IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. ఫుల్ జోష్ మీదున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సంధర్భంగా సంగీత దర్శకుడు తమన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం…

 

మీ కెరీర్ ప్రస్తుతం పీక్ లో ఉంది. ఎలా అనిపిస్తోంది ?

అన్ని మంచి స్క్రిప్ట్స్ వచ్చాయి. మంచి కథే ఎప్పుడూ మంచి పాటలను తీసుకుంటుంది. నా సాంగ్స్ కు విపరీతమైన స్పందన వస్తోందంటే కారణం మంచి స్క్రిప్ట్ లే, నాదేం లేదు. నాకు వచ్చిన అవకాశాలు గొప్పవి.

 

‘వెంకీ మామ’ గురించి చెప్పండి ?

‘వెంకీ మామ’ ఒక ఎమోషనల్ సినిమా అండి. అది బయటకు తెలియట్లేదు గాని, సినిమాలో వెరీ ఎమోషనల్ కంటెంట్ ఉంది. ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. నేను రఫ్ వర్షన్ ను చూసినప్పుడే నేను కంటతడి పెట్టాను. అంతలా కనెక్ట్ అవుతొంది సినిమా.

 

ఎమోషనల్ ఫిల్మ్ అంటున్నారు. ఆ ఎమోషన్ హైలైట్ అయ్యేలా సాంగ్ ఏమైనా ఉంటుందా ?

లిరిక్స్ లేని బిట్ సాంగ్ ఒకటి చిన్నగా ఉంటుంది. అంటే సినిమాలో థీమ్ సాంగ్ లా వస్తోంది.

 

మొదటిసారి వెంకటేష్ నాగ చైతన్య కలిసి నటిస్తున్నారు ?

మామా అల్లుడా అన్నట్లు ఇద్దరూ పోటీపడి చేశారు. వెంకటేష్ గారి అనుభవం కూడా సినిమాకి అలాగే చైతుకి ఎంతో హెల్ప్ అయింది. ఇద్దరు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాల బాగా అలరిస్తాయి.

 

డైరెక్టర్ మీకు మొత్తం స్క్రిప్ట్ తో పాటు సాంగ్స్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలనే అనే విషయాలను చెబుతాడా ?

సాంగ్స్ ను ఎలా రాయించాలి, సెకెండ్ హాఫ్ లో సాంగ్ ను ఫస్ట్ హాఫ్ కి ఎలా కనెక్ట్ చెయ్యాలి లాంటి విషయాలు డైరెక్టర్ తో చర్చిస్తాను. ఎప్పుడైనా స్క్రిప్ట్ పై డైరెక్టర్ కి ఫుల్ క్లారిటీ ఉంటుంది. అందుకే డైరెక్టర్ ని ఫాలో అవ్వటమే బెటర్. నేను అలాగే ఫాలో అయ్యాను. ఒక విధంగా ఈ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ లా పని చేశాను.

 

ఒక సాంగ్ కంపోజ్ చేసేటప్పుడే అది మీకు తెలిసిపోతుందా. ఇది క్లిక్ అవుతుందా లేదా అని ?

మా అనుభవం అక్కడే కదా ఉపయోగపడేది. ఒక సాంగ్ ను బోర్ కొట్టకుండా ఎలా కంపోజ్ చెయ్యాలి, చేసిన సాంగ్ హిట్ అవుతుందా లేదా అనేది ముందే అర్ధమైపోతుంది.

 

‘వెంకీ మామ’లో కమర్షియల్ అంశాలు ఎంతవరకు ఉంటాయి ?

ప్రేక్షుకులు ఫుల్ గా ఎంజాయ్ చేసే అన్ని కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అయితే ఇది ఎమోషనల్ ఫిల్మ్ కూడా. మెయిన్ గా మహిళా ప్రేక్షుకులు అందరూ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.

సంబంధిత సమాచారం :

More