రాజా సాబ్ స్కోర్ లో బిజీ బిజీగా థమన్..బీట్స్ అదుర్స్

రాజా సాబ్ స్కోర్ లో బిజీ బిజీగా థమన్..బీట్స్ అదుర్స్

Published on Dec 31, 2025 7:06 AM IST

Thaman-and-raja-saab

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్ అలాగే మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతి తెరకెక్కించిన అవైటెడ్ హారర్ విజువల్ ట్రీట్ సినిమానే ది రాజా సాబ్. ఇక ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనగా మేకర్స్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి ఇందులో సంగీత దర్శకుడు థమన్ కూడా గట్టిగా కష్టపడుతున్నాడు.

ఈ సినిమా స్కోర్ ప్రస్తుతం చేస్తున్నట్టు మిక్సింగ్ వీడియో తను విడుదల చేశాడు. ఇక ఇందులో స్కోర్ వింటుంటే థియేటర్స్ లో అదిరేలా కనిపిస్తుంది. ఇలా ఫ్యాన్స్ లో మరిన్ని అంచనాలు తను పెంచుతున్నాడు. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, బొమన్ ఇరానీ తదితరులు నటించగా ఈ జనవరి 9న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు