పవన్ ఫ్యాన్స్ కి తీపి కబురు చెప్పిన థమన్

Published on Feb 8, 2020 7:02 am IST

అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ ఫార్మ్ లోకి వచ్చాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఆ మూవీ సాంగ్స్ పెద్ద సెన్సేషన్ కాగా ఆయన ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. ఇక థమన్ చేతిలో అనేక చిత్రాలు ఉన్నాయి. వాటిలో మహేష్ నెక్స్ట్ మూవీ తో పాటు, పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ పింక్ రీమేక్ కూడా ఉంది. కాగా నిన్న సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ కి థమన్ ఓ తీపి కబురు పంచారు.

పింక్ రీమేక్ కి సంబంధించి ఆయన కొన్ని పవన్ కళ్యాణ్ పిక్స్ చూశారట. అవి అద్భుతంగా ఉన్నాయి అన్న ఆయన… వాటి గురించి ఎక్కువ చెప్పనులే గాని, పింక్ రీమేక్ కోసం శక్తి వంచన లేకుండా పనిచేసి బెస్ట్ ట్యూన్స్ ఇస్తానని మాట ఇస్తున్నాడు. దీనితో పింక్ రీమేక్ లో సాంగ్స్ ఓ రేంజ్ లో ఉండనున్నాయని చెప్పకనే చెవుతున్న థమన్ పవన్ లుక్ కూడా మెస్మరైజింగ్ గా ఉందని చెవుతున్నాడు. ఇక దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :