శంకర్ – రామ్ చరణ్ సినిమా కి థమన్ సంగీతం!

Published on Jul 19, 2021 12:01 pm IST

పాన్ ఇండియా సినిమాల దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. అయితే ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. ఈ విషయాన్ని నేడు చిత్ర యూనిట్ అఫిషియల్ గా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్ జాని మాస్టర్ ఈ చిత్రం కోసం పని చేస్తుండగా, తాజాగా సంగీతం తమన్ అని తెలియడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల థమన్ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో నుండి ఇటీవల వచ్చిన వకీల్ సాబ్, వరకు థమన్ సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ మరియు శంకర్ ల సినిమా పాన్ ఇండియన్ మూవీ కావడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :