నెటిజన్ ట్రోల్ కి స్వాగ్ రిప్లై ఇచ్చిన థమన్.!

Published on May 9, 2021 2:59 pm IST

ఇప్పుడు ఒక్క మన టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం సౌత్ ఇండియాలో కూడా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిచాడు ఎస్ ఎస్ థమన్. అయితే తన కెరీర్ ఆరంభం నుంచి అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఆల్బమ్స్ తో పాటుగా పలు ట్రోల్స్ కూడా థమన్ పై పడ్డాయి. కానీ వాటికి ఎప్పటికప్పుడు థమన్ కూడా గట్టి సమాధానమే ఇస్తూ వచ్చే వాడు. అలాగే ఇప్పుడు కూడా తనపై ట్రోల్ వేసిన నెటిజన్ కు గట్టి రిప్లై ఇచ్చాడు.

థమన్ ను ఉద్దేశించి కింగ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ రోల్ చేసిన బ్రహ్మానందం ఫోటోలు పెట్టి తన పిల్లలకు అతనే థమన్ అని చెప్తానని పెట్టగా దానికి థమన్ రిప్లై ఇస్తూ అలాగే నీ భార్యకి కూడా చెప్పు నువ్వు మీమ్స్ చేసుకోడంలో బిజీగా ఉన్నవని అపుడు ఆమె తన జీవితంలో పెళ్లి చేసుకుంది ఒక పనికి రాని మీమర్ ని అని అర్ధం చేసుకుంటుంది” అని ఎక్కడా తగ్గకుండా గట్టి రిప్లై ఇచ్చేసాడు. దీనితో థమన్ ఫాలోవర్స్ సరైన రిప్లై నే ఇచ్చారని సపోర్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా “వకీల్ సాబ్”తో మరో అదిరే ఆల్బమ్ ఇచ్చిన మరిన్ని ఆసక్తికర ఆల్బమ్స్ చేస్తూ ఎన్నడూ లేని విధంగా మరింత బిజీ అయ్యిపోయాడు.

సంబంధిత సమాచారం :