సూపర్ స్టార్ తో స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకున్న థమన్.!

Published on May 11, 2022 8:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని ఎట్టకేలకు మేకర్స్ రేపు రిలీజ్ చేస్తుండగా మేకర్స్ మంచి ప్రమోషన్స్ ని కూడా నాన్ స్టాప్ గా చేస్తూ సినిమా పై అంచనాలు పెంచే విధంగా చేస్తూ వెళ్తున్నారు.

మరి ఇందులో భాగంగా ఈ సినిమాకి వర్క్ చేసిన సంగీత దర్శకుడు థమన్ తమ సూపర్ స్టార్ మహేష్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోవడం ఆసక్తిగా మారింది. దీనిపై తన స్పందనను కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా పంచుకున్నాడు. అలాగే ఇందులో మహేష్ 28వ సినిమా కోసం కూడా ఉండేట్టు తెలుస్తుంది. మరి ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా రేపు మే 12న ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :