ఊపందుకున్న ఎన్టీఆర్ సినిమా పనులు !


యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కొత్త సినిమా షూటింగ్ కొద్దిరోజుల క్రితమే మొదలైంది. తారక్, త్రివిక్రమ్ లు మొదటిసారి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇలా షూటింగ్ మొదలుకాగానే చిత్ర సంగీత దర్శకుడు తమన్ కూడ తన పనుల్ని షురూ చేశారు. ప్రస్తుతం తన టీమ్ తో కలిసి రికార్డింగ్ మొదలుపెట్టారాయన.

మరోవైపు ఫస్ట్ లుక్ కోసం ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రఫర్ దాబు రత్నాని ఎన్టీఆర్ ను ఫోటోషూట్ కూడ చేశారు. గతంలో ఈయన ఎన్టీఆర్ యొక్క ‘జనతాగ్యారేజ్’ సినిమాకి కూడ ఫోటోషూట్ నిర్వహించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ఎన్టీఆర్ కు జోడీగా నటించనుంది.