ఆగష్టు 9వ తేది హిస్టరీగా మారడం ఖాయమన్న థమన్..!

Published on Aug 4, 2021 11:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మూవీస్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ఫస్ట్ నోటీసు అంటూ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9న అసలైన ట్రీట్ ఉండబోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్‌మెంట్ చేయడంతో దీనిపై మహేశ్ ఫ్యాన్స్ రెట్టింపు అంచనాలతో, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అంచనాలను మరింత పెంచేలా థమన్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ఆగష్టు 9వ తేది ఖచ్చితంగా ఓ హిస్టరీగా మారబోతుందని, బాణాసంచా కాల్చేందుకు రెడీగా ఉండడని థమన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇవ్వన్ని చూస్తుంటే ఆగష్టు 9న బొమ్మ దద్దరిల్లడం ఖాయంగా అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :