రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సత్యదేవ్, తమన్నా ల ‘గుర్తుందా శీతాకాలం’

Published on Aug 16, 2022 7:08 pm IST

మిల్కి బ్యూటీ తమన్నా, విలక్షణ నటుడు సత్యదేవ్ కలిసి తొలిసారిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుర్తుందా శీతాకాలం. నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎం ఎస్ రెడ్డి, చిన్నబాబు నిర్మించారు. యాక్షన్, లవ్, ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది,

అయితే మధ్యలో కొన్ని కారణాల వలన రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీని ఫైనల్ గా సెప్టెంబర్ 9, 2022 న రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కన్నడ సక్సెస్ఫుల్ మూవీ లవ్ మాక్ టైల్ కి రీమేక్ గా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలంలో మేఘా ఆకాష్, కావ్య శెట్టి, సుహాసిని కీలక పాత్రలు చేసారు. అలరించే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ మూవీ తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం :