ఆ హీరో కి స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన తమన్నా

Published on Apr 3, 2020 8:58 pm IST

ఎప్పటీకి నా ఫెవరేట్ అండ్ బాగా ఇష్టమైన హీరో ప్రభుదేవా సార్ కి బర్త్ డే విషెష్ అన్నారు హీరోయిన్ తమన్నా. ఆమె ట్విట్టర్ వేదికగా హీరో, కొరియాగ్రాఫర్, డైరెక్టర్ అయిన ప్రభుదేవాకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుదేవా తో తమన్నా రెండు చిత్రాలలో నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటిసారి 2016లో అభినేత్రి అనే చిత్రం రావడం జరిగింది. ఈ మూవీ హిందీ మరియు తమిళ భాషలలో కూడా విడుదలైంది. ఈ మూవీ విజయం సాధించడంతో దీనికి కొనసాగింపుగా గత ఏడాది అభినేత్రి 2 రావడం జరిగింది. కామెడీ హారర్ జోనర్ వచ్చిన ఈ చిత్రాలు మంచి ఆదరణే దక్కించుకున్నాయి.

ఇక తెలుగులో తమన్నా ప్రస్తుతం మూడు చిత్రాల వరకు నటిస్తుంది. హిందీ మూవీ క్వీన్ తెలుగు రీమేక్ థట్ ఈజ్ మహాలక్ష్మీ తోపాటు, గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా సీటీమార్ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రంలో తమన్నా జ్వాలా రెడ్డి అనే లేడీ కబడ్డీ కోచ్ రోల్ చేస్తున్నారు. ఇక హిందీలో బోల్ చుడియన్ అనే చిత్రంలో కూడా తమన్నా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More