‘ధృవ’ ఒరిజినల్ వర్షన్ కి సీక్వెల్ రానుంది !

Tani orvan

జయం రవి, నయనతార జంటగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తని ఒరువన్’. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అరవింద స్వామి ప్రతినాయకుడి పాత్రలో నటించారు. 2015లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ ను సాధించింది. తరువాత ఈచిత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో తెలుగులో ‘ధృవ’ పేరుతో రీమేక్ చేశారు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈచిత్రం 210 6లో విడుదలై ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఇపుడు ఈ చిత్ర ఒరిజినల్ వర్షన్ తని ఒరువన్ కి సీక్వెల్ తెరకెక్కనుంది. జయం రవి హీరోగా ఆయన అన్న మోహన్ రాజా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈచిత్రానికి సంభందించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి ఈచిత్రంకూడా సూపర్ హిట్ అయితే తెలుగులో మళ్లీ ‘ధృవ2’పేరుతో ఈచిత్రాన్ని రామ్ చరణ్ తో రీమేక్ చేసే అవకాశం లేకపోలేదు.

Exit mobile version