జపాన్‌ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్ !

Published on Sep 11, 2018 11:28 am IST

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన భారీ బ్లాక్ బ్లస్టర్ చిత్రం ‘మగధీర’. కాగా ఈ చిత్రాన్ని ఈ మధ్యే జపాన్‌లో రిలీజ్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా అక్కడ ప్రజల ‘మగధీర’ సినిమా పై విశేషమైన ఆసక్తిని కనబరుస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం పది రోజులుగానూ మొత్తం 17 కోట్లు వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

దీంతో రామ్ చరణ్ జపాన్‌ సినీ ప్రేక్షకులకు తన ఫేస్‌బుక్‌ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ.. ‘థాంక్యూ జపాన్‌.. మీరు మా సినిమా పై చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే చాలా ఆనందంగా, ఎంతో గౌరవంగా అనిపిస్తోంది. మీ అమూల్యమైన ప్రేమను అభిమానాన్ని మర్చిపోలేను. మగధీర లాంటి గొప్ప చిత్రాన్ని నాకు ఇచ్చినందుకు ఎస్‌.ఎస్‌. రాజమౌళి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తేలుపుకుంటున్నాను. ఈ సినిమా విడుదలై అప్పుడే పదేళ్లు గడిచిపోయాయి అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను’ అని రామ్ చరణ్ పోస్ట్ చేశారు.

Thank you Japan.. feel really blessed and humbled with all the love showered upon us. This will always remain close to my heart.. A big thank you to @ssrajamouli garu for this memorable film. Can’t believe it’s been 10 years already..

సంబంధిత సమాచారం :