వీవీఎస్‌ లక్ష్మణ్‌’కి థాంక్స్ చెప్పిన మహేష్ బాబు !

Published on Jul 23, 2019 11:46 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. కాగా తాజాగా ‘మహర్షి’ చిత్రాన్ని ఉద్దేశిస్తూ మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు.

లక్ష్మణ్‌ పోస్ట్ చేస్తూ… ‘మహర్షి’ చిత్రాన్ని చూశాను. నాకు చాల బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికీ మంచి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చే సినిమా ఇది. మహేశ్‌ బాబు మరోసారి తన పవర్‌ఫుల్‌ యాక్టింగ్ తో మనల్ని మెప్పించారు’ అని పేర్కొన్నారు. మహేష్ తమ సినిమా నచ్చినందుకు లక్ష్మణ్ కి థ్యాంక్యూ సో మచ్ సర్ అని చెప్పాడు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అలాగే ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :

X
More