థాంక్యూ అనే పదానికి అసలైన అర్ధం చెప్పిన ‘థాంక్యూ’ మూవీ చేసినందుకు ఆనందంగా ఉంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య

థాంక్యూ అనే పదానికి అసలైన అర్ధం చెప్పిన ‘థాంక్యూ’ మూవీ చేసినందుకు ఆనందంగా ఉంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య

Published on Jul 17, 2022 12:51 AM IST


అక్కినేని నాగ చైతన్య హీరోగా రాశి ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్ గా దిల్ రాజు, శిరీష్ కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన మూవీ థాంక్యూ. ఎంతో భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీని విక్రమ్ కె కుమార్ తెరకెక్కించగా మ్యూజికల్ సెన్సేషన్ థమన్ దీనికి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకున్న థాంక్యూ మూవీ ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శనివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా వైజాగ్ లో నిర్వహించారు.

హీరో అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ, తాత గారు నాన్న గారు ఇద్దరి ఇన్స్పిరేషన్ వల్లనే సినిమాల్లోకి వచ్చాను. ఇక థాంక్యూ మూవీ తో మరొక్కసారి మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది. నిజానికి నేను ఇక్కడికి రావడానికి ఆడియన్స్, ఫ్యాన్స్ కారణం .మీ అందరికీ కూడా ప్రత్యేకంగా థాంక్స్ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. నా ఈ ఎనర్జీకి కారణం అభిమానులే. నిజంగా అభిమానులు అంటే అక్కినేని అభిమానులే, ఎల్లప్పుడూ మా వెంటే ఉండే మీకోసం రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాను. మనం ఎక్కడ మొదలయ్యాము అనే విషయాన్ని గనుక మర్చిపోతే మన జీవితానికి విలువ ఉండదు అనే డైలాగ్ మా థాంక్యూ మూవీలో ఉంది. ఆ డైలాగ్ గుర్తొచ్చినప్పుడల్లా నాకు వైజాగ్ గుర్తుకు వస్తుంది. నా సక్సెస్ స్టోరీ కి రీజన్ వైజాగ్, నాకు హీరోగా మంచి కమర్షియల్ సక్సెస్ ఇవ్వడంతో పాటు హీరోగా నన్ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది వైజాగ్. కొన్ని కథలను సినిమాగా చెప్పవచ్చు, కానీ వాటిని థియేటర్స్ లోచూసే ఆడియన్స్ మనసు తాకేలా తీస్తే తప్పకుండా ఆ ఫీల్ మనల్ని కూడా టచ్ చేస్తుంది.

నిజానికి మనం రోజు లైఫ్ లో ఎన్నోసార్లు థాంక్యూ పదాన్ని వాడతాము, కానీ అవసరమైన చోట మాత్రం దానిని వాడము. థాంక్యూ అనే పదానికి అసలైన అర్ధం చెప్పే థాంక్యూ మూవీ చేసినందుకు ఎంతో ఆనంధంగా ఉంది, ఈ సినిమా ఎంతో నేర్పించింది, తప్పకుండా మీరు కూడా మూవీ ద్వారా కొంత ఇన్స్పైర్ అవుతారు. ముందుగా ఈ మూవీ చేయడానికి ముందుకి వచ్చిన నిర్మాత దిల్ రాజు గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. ఆయనకు కథ నచ్చిన వెంటనే టీమ్ తో సహా అందరికీ ఎంతో సపోర్ట్ అందించారు. ఇక డైరెక్టర్ విక్రమ్ కుమార్, మా ఫామిలీ కి మనం వంటి సూపర్ హిట్ ఇచ్చారు. బివిఎస్ రవి వచ్చి కథ చెప్పినపుడు వారిద్దరూ కలిసి పని చేసిన ఈ స్టోరీ నాకు చెప్పడం, అది నచ్చడంతో ఇంతటి గొప్ప సినిమా చేశాను, వారిద్దరికీ కూడా థాంక్స్ అన్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నేను గతంలో నటించిన మజిలీ మూవీ కేవలం ఏడు రోజుల్లో ఎలా పూర్తి చేసారో తెలియదు. ఆ మూవీ సాంగ్స్, బీజీఎమ్ అన్ని కూడా సూపర్బ్. అనే ప్రస్తుతం థాంక్యూ మూవీ కి కూడా ప్రాణం పెట్టాడు థమన్, తనకి కూడా స్పెషల్ థాంక్స్. పిసి గారికి వందసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది, నిజానికి ఆయనతో కలిసి పని చేయాలి అనేది నా డ్రీమ్. ఈ మూవీ తో ఆ డ్రీమ్ తీరింది, అనే ఎడిటర్ ప్రవీణ్, హీరోయిన్స్ రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ తో పాటు యావత్ మా థాంక్యూ టీమ్ మొత్తానికి ప్రత్యేకంగా థాంక్స్, తప్పకుండా 22న రిలీజ్ కాబోతున్న మూవీ అందరినీ అలరిస్తుందని అన్నారు నాగ చైతన్య.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, నాకు వైజాగ్ తో ఎంతో మంచి అనుబంధం ఉంది. అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా జులై 22 వరకు మీ ఎనర్జీ అలానే ఉంచుకోండి. తప్పకుండా ఆ రోజున మా థాంక్యూ మూవీ మీ అందరికీ ఎంతో నచ్చుతుందని అన్నారు. ఇక మొదట ఈ కథ విన్నపుడు ఎంతో బాగుంది అనిపించింది. అయితే దీనిని కథగా మాత్రమే కాదు, ఒక జర్నీ గా చెపితే మరింత బాగుంటుంది కదా అనిపించింది. ఆ జర్నీ మీరు రేపు థియేటర్ లో చూస్తారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో అమ్మ నాన్న, గురువు, దైవం, స్నేహితులు, తోబుట్టువులు, శ్రేయోభిలాషులు ఎందరో ఉంటారు. నిజానికి నేను నా లైఫ్ లో అన్ని చూసాను. ఈరోజున నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లితండ్రులు. నాకు జీవితం ఇచ్చి, మంచి చెడులు నేర్పించి తీర్చిదిద్దారు. ముందుగా వారికి థాంక్స్. అలానే నా బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ, ముఖ్యంగా నా చదువు అయిపోయినపుడు నేను ఆటో మొబైల్ షాప్ పెట్టాను, దానికి సహాయం అందించిన వారు అందరికీ ప్రత్యేకంగా థాంక్స్.

ఇక నా జీవితంలో సహధర్మ చారిణిగా 27 ఏళ్ళ పాటు కొనసాగిన నా భార్య అనితకి థాంక్స్. సినిమా అంటే నాకు ఫ్యాషన్, అయితే ఆ సమయంలో నాకు ఏమి తెలియదు. అనంతరం నన్ను సినిమాల్లోకి తీసుకువచ్చిన మహేందర్ రెడ్డి గారికి థాంక్స్. అల్లుడా మజాకా మూవీతో వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గా లైఫ్ స్టార్ట్ చేశాను. ఆ తరువాత నాకు పెళ్లిపందిరి మూవీతో ఫస్ట్ సక్సెస్ ఇచ్చిన నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణగారికి, దర్శకుడు కోడి రామకృష్ణ గారికి థాంక్స్. ఆ తరువాత నేను నిర్మాతగా ఫస్ట్ సినిమా దిల్ చేశాను. ఇక నా ఫస్ట్ మూవీ కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వినాయక్ కి థాంక్స్, తనవల్లనే నిర్మాతగా కొనసాగాను. అక్కడి నుండి ఇప్పటివరకు కెరీర్ పరంగా 50 సినిమాలు నిర్మించాను. నాకు కెరీర్ పరంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క నటుడికి, టెక్నీషియన్ కి, ముఖ్యంగా హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్,నాని, నాగ ఛైతన్య అందరికీ థాంక్స్. ఇక ఈ మూవీలో మూడు వేరియేషన్స్ ఉన్న రోల్ లో చైతన్య ఎంతో అద్భుతంగా నటించారు. ఇందులో లవ్ స్టోరీ, కాలేజీ స్టోరీ, లైఫ్ స్టోరీ ఇలా మూడు పేజ్ ల్లో కొనసాగుతుంది. హీరోయిన్స్ రాశి, మాళవిక, అవికా ముగ్గురూ ఎంతో బాగా చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రాణం పెట్టి సాంగ్స్, బీజీఎమ్ అందించారు. మొత్తంగా మా థాంక్యూ మూవీ 22న రిలీజ్ తరువాత మీ అందరినీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకం నాకుంది అన్నారు దిల్ రాజు.

డైరెక్టర్ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, ముందుగా మా నాన్న గారికి, నాకు ఇష్టమైన స్నేహితుడు చైతన్య గారికి, పిసి శ్రీరామ్ గారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్క బ్రిలియంట్ యాక్ట్రర్, టెక్నీషియన్ కి థాంక్స్. చైతన్య తో ప్రయాణం ఇప్పుడే మొదలైంది, ఇక రాబోయే రోజుల్లో నటుడిగా ఇంకా ఎన్నో సాధించాలి, సాధిస్తాడు కూడా. మంచి కథను అందించిన రవి గారికి, దిల్ రాజు గారికి, ఎడిటర్ ప్రవీణ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గారికి, అలానే హీరోయిన్స్ కి అలానే అందరికీ స్పెషల్ థాంక్స్ అన్నారు విక్రమ్.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ, మన లైఫ్ లో మనం ప్రస్తుతం ఉన్న పొజీషన్ కి కారణం తప్పకుండా ఎంతో మంది సహాయం. అమ్మ, నాన్న, తోబుట్టువులు, స్నేహితలు, గురువులు ఇలా ప్రతి ఒక్కరి సహాయం వల్లనే మనం జీవితంలో ప్రస్తుతం ప్రయాణం కొనసాగిస్తున్నాం. నా జీవితంలో జరిగిన గొప్ప పని థాంక్యూ మూవీ చేయడం. ఈ మూవీ చేస్తున్న సమయంలో నాకు గురువులైన కీరవాణి గారు, మణిశర్మ గారు, కోటి గారు అందరికీ థాంక్స్ చెప్పాను. మొన్న మణిశర్మ గారి బర్త్ డే రోజున ఆయనని హగ్ చేసుకుని నేను ఈ రోజున ఇలా ఉండడానికి మీరే కారణం సర్ అని ప్రత్యేకంగా ఆయనకి థాంక్స్ చెప్పాను. ఈ సినిమా నిజంగా ఒక గొప్ప అనుభూతి. తప్పకుండా సినిమా చూసిన తరువాత మీ మదిలో కూడా మీకు సహాయపడిన వారు మెదులుతారు. నిర్మాత దిల్ రాజు గారు చిన్నపిల్లాడిలా సినిమా కోసం ఎంతో కష్టపడతారు. ఇక్కడ సంపాదించినా దానిని ఇక్కడే సినిమాలకే ఆయన ఇన్వెస్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం. డైరెక్టర్ విక్రమ్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి. తనతో మనం మూవీ చేయాల్సింది, కానీ అప్పట్లో కొన్ని కారణాల వలన కుదరలేదు. ఈ సినిమా ఇచ్చినందుకు తనకు ప్రత్యేకంగా థాంక్స్. మజిలీ మూవీ చూసి ప్రేమలో పడిపోయాను, ఈమూవీ చేసిన చైతన్య కి థాంక్స్. తాను ఈ మూవీలో మూడు వేరియేషన్స్ లో ఎంతో కష్టపడి యాక్ట్ చేసారు, తప్పకుండా ఈ మూవీ మీ అందరికి నచ్చుతుందని అన్నారు.

రైటర్ బివిఎస్ రవి మాట్లాడుతూ, నిజానికి థాంక్యూ అనే పదం గురించి, ఆ పదంలోని డెప్త్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ మూవీలో మాకు వీలైనంతవరకు ప్రయత్నించాము. గ్రాటిట్యూడ్ అనే పదం మన గుండెల్లోనుండి రావాలి. ఫ్రెండ్ షిప్ అనేది చిన్న చిన్న గొడవల కంటే కూడా ఎంతో గొప్పది. దానిని గుర్తు చేసుకునే ప్రయత్నమే ఈ థాంక్యూ మూవీ. నాకు ఎంతో ఇష్టమైన మా బాబాయి చనిపోయినపుడు ఆయనని తల్చుకుని సోషల్ మీడియాలో పోస్టు రాస్తున్నప్పుడు ఈయనతో నాకు ఉన్న అనుబంధం ఇంత గొప్పదా అనిపించింది. తరువాత దాని నుండి ఒక కథను తాయారు చేసి రాజు గారికి వినిపించడం జరిగింది. మరి ఈ కథ ఏ డైరెక్టర్, ఏ హీరో చేస్తే బాగుంటుందని ఆలోచించిన అనంతరం డైరెక్టర్ గా విక్రమ్ కుమార్ ని అనుకున్నాం. ఈ కథని గులాబీ రేకు వంటి మనిషి చెప్తే, తేనె ధార వంటి వ్యక్తి చెప్తే బావుంటుంది. అలానే మంచివాడి కోపంలాంటి ప్యూరిటీ ఉన్న వ్యక్తి చెప్తే ఇంకా బాగుంటుందని, అటువంటి మంచి మనసున్న వ్యక్తి హీరో నాగ చైతన్య అయితేనే పర్ఫెక్ట్ అని భావించాము. ఆయన వంటి సంపూర్ణమైన వ్యక్తి ఈ కథని చెప్తే అందరికీ చేరుతుందని అనుకున్నాం.

రాకెట్ పైకి వెళ్ళేటపుడు బరువులు అన్ని వదిలించుకుంటుంది. ఈ బరువులు అన్ని వదిలించుకోవడం వల్లనే నేను పైకి వెళ్తున్నాని రాకెట్ అనుకున్నప్పటికీ, అది పైకి వెళ్లాలంటే తనని మోస్తున్న మనం వదిలేయాలనే బరువులు గొప్పవి. మనల్ని పైకి తీసుకువెళ్లే ఆ బరువులు, మనం వెనక్కి తిరిగి చూస్తే వస్తాయి. మనం ఇంత దూరం ఎలా వచ్చాము అనే ఆలోచన చేసి వారందరికీ థాంక్యూ చెప్పే సినిమా ఇది. ఎన్నో సినిమాలు వస్తాయి కానీ ఆడియన్స్ మనసులో ఉండిపోయే సినిమా ఇది. ఈ రాకెట్ ని నటుడు ప్రకాష్ రాజ్, సుశాంత్, రాశి ఖన్నా, వంటి వారు మోశారు. వీళ్ళందరూ కలిసి అభిరాం ని గెలిపించిన కథే ఇది. నిర్మాత దిల్ రాజు గారు మూవీ చేసినందుకు థాంక్స్, థమన్ సోల్ పెట్టి ఈ మూవీ మ్యూజిక్ ఇచ్చాడు. నాకు ఈ సందర్భంగా రైటర్ గా అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి థాంక్స్, ఓర్పు నేర్పిన దిల్ రాజు గారికి, ఆలోచన నేర్పించిన రామ్ గోపాల్ వర్మ గారికి, ఆనందం నేర్పించిన రాఘవేంద్ర రావు గారికి, నన్ను భరించిన నా భార్యకు, నన్ను భరిస్తున్న మా అమ్మకు స్పెషల్ థాంక్స్ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు