మిథాలీ బయోపిక్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

Published on Jan 29, 2020 6:32 pm IST

విమెన్ క్రికెట్ లో సంచనాలు నమోదు చేసిన హైదరాబాదీ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం శభాష్ మిథు. విమెన్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా సుధీర్గ కాలంగా కొనసాగుతున్న మిథాలీ రాజ్ అనేక రికార్డ్స్ తన పేరున నమోదు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన, అత్యధిక అర్థ సెంచరీలు చేసిన విమెన్ క్రికెటర్ గా ఉన్న మిథాలీ పేరున అనేక రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పటికే భారత్ ప్రభుత్వం ఈమెకు అర్జున అవార్డ్, పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చి సత్కరించడం జరిగింది.

శభాష్ మిథు చిత్రంలో మిథాలీ రాజ్ గా తాప్సి పన్ను నటిస్తుండగా నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. మిథాలీ పాత్రలో తాప్సి చాలా చక్కగా సరిపోయారు. రాహుల్ ధోలాకియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా వియాకామ్ స్టూడియోస్ నిర్మిస్తున్నారు. 2021 ఫిబ్రవరి 5న ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :