‘గాడ్ ఫాదర్’ లో మైండ్ బ్లోయింగ్ బ్లాక్ అదే – సత్యదేవ్

Published on Sep 28, 2022 12:17 am IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఎత్తున తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ ని మోహన్ రాజా తెరకెక్కించగా ఎస్ థమన్ సంగీతం అందించారు. నయనతార, సముద్రఖని, సత్యదేవ్ సునీల్ వంటి వారు ఇతర పాత్రలు చేసిన ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు అనంతపూర్ లో ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్నారు. మరోవైపు ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్, థార్ మార్ సాంగ్ అన్ని ఆడియన్స్ ని ఆకట్టుకోగా థియేట్రికల్ ట్రైలర్ ని రేపటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు.

అయితే విషయం ఏమిటంటే ఈ మూవీలో కీలక రోల్ చేస్తున్న సత్యదేవ్ నేడు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ తో ఫస్ట్ టైం వర్క్ చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయన పక్కా పెర్ఫెక్షనిస్ట్ అని, అలానే సెట్స్ లో ఉన్నప్పుడు అందరితో ఎంతో సరదాగా ఉంటారని అన్నారు. ఇక గాడ్ ఫాదర్ విషయానికి వస్తే తన పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని, తప్పకుండా తన కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందని అన్నారు. ఇక ఈ మూవీలో వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ నిజంగా మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని, దర్శకుడు మోహన్ రాజా తో పాటు టీమ్ మొత్తం కూడా మూవీ కోసం ఎంతో కష్టపడ్డారని అన్నారు. అక్టోబర్ 5న తామందరి కృషికి మంచి ఫలితం అందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు సత్యదేవ్.

సంబంధిత సమాచారం :