ఆ హీరో చరణ్ అన్న పాత్రలో నటిస్తున్నాడు !
Published on Feb 18, 2018 10:20 am IST

చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా లో స్నేహ, తమిళ్ హీరో ప్రశాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ చరణ్ అన్న పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అల్లరి నరేష్ అన్న ఆర్యన్ రాజేష్ గతంలో హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. కొంత విరామం తరువాత రాజేష్ బోయపాటి సినిమాలో నటిస్తుండడం విశేషం. మాస్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాలో జర్నీ సినిమా హీరోయిన్ అనన్య చరణ్ వదిన పాత్రలో కనిపించబోతోంది.

 
Like us on Facebook