చిరు ‘వేదాళం’లో హైలైట్ అదేనట !

Published on Aug 16, 2021 7:03 am IST

దర్శకుడు మెహ‌ర్ రమేష్ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో ‘వేదాళం’ సినిమా రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి అయింది. అయితే, ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ హెవీ ఎమోషనల్ గా ఉంటుందని.. కాగా ఈ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోందని తెలిసిందే. అయితే కీర్తి – చిరు మధ్య ట్రాక్ సినిమాలోనే హైలైట్ అవుతుందట.

ఇక త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. అయితే, ఎనిమిది సంవత్సరాల తరవాత మెహ‌ర్ రమేష్ సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ పిలిచి మరీ అతనికి ఆవకాశం ఇవ్వడం విశేషం. మరి మెహర్ రమేష్, ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాలో పక్కా కమర్షియల్ అంశాలను కూడా పెట్టాడు. కాబట్టి హిట్ కొడతాడని టీమ్ నమ్మకంగా ఉంది.

సంబంధిత సమాచారం :