‘అవె’ ఫెమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తమన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం దటీజ్ మహాలక్ష్మి. హిందీ లో కంగనా రనౌత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘క్వీన్’ రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన చిత్రీకరణ పూర్తియింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ నెలలో విడుదల కానుంది.
ఇక తెలుగు తో పాటు గా తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో ఈ క్వీన్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. తమిళ భాషలో కాజల్ ప్రధాన పాత్రలో ‘పారిస్ పారిస్’ పేరుతో అలాగే కన్నడలో పరుల్ యాదవ్ ప్రధాన పాత్రలో ‘బట్టర్ ఫ్లై’ పేరుతో రమేష్ అరవింద్ తెరకెక్కిస్తున్నారు. ఇక మళయాళం లో మంజిమ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘జాం జాం’ అనే టైటిల్ తో నీలకంఠ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.


