హీరోలుగా ఎన్టీఆర్, చరణ్ లను అందుకే తీసుకున్నారట.

హీరోలుగా ఎన్టీఆర్, చరణ్ లను అందుకే తీసుకున్నారట.

Published on Apr 24, 2020 11:39 AM IST

ఎప్పుడో ఎన్టీఆర్,చిరంజీవి కలిసి నటించిన తరువాత మళ్ళీ మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ హీరోలు కలిసి నటించింది లేదు. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తూ రాజమౌళి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేశారు. ఐతే ఆర్ ఆర్ ఆర్ కొరకు ఎన్టీఆర్, చరణ్ లనే ఎంచుకోవడానికి గల కారణాలు రాజమౌళి తెలియజేయడం జరిగింది. రాజమౌళి గతంలో వీరిద్దరితో కలిసి పనిచేయం జరిగింది. ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేసిన ఆయన చరణ్ తో మగధీర మూవీ తెరకెక్కించారు. కాబట్టి వీరితో వర్క్ కంఫర్ట్ గా ఉంటుంది అనేది ఒక కారణం.

ఇక టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో చరణ్, ఎన్టీఆర్ మంచి మిత్రులుగా ఉన్నారు. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం రీత్యా స్క్రీన్ పై కూడా కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుందని రాజమౌళి భావించారట. అందుకే రాజమౌళి ఛాయిస్ ఎన్టీఆర్ ,చరణ్ అయ్యారని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు