భీమ్, అల్లూరి ఇన్ సేమ్ కాస్ట్యూమ్స్..ఏంటి సంగతి?

Published on May 21, 2020 8:56 am IST

ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి నిన్న రామ్ చరణ్ ఓ ఆన్ లొకేషన్ స్టిల్ పంచుకున్నారు. ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెవుతూ, ఆయన ఇద్దరు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిద్దరూ వైట్ అండ్ వైట్ ధరించి వుండగా, ఎన్టీఆర్ చరణ్ ని వెనక నుండి కౌగిలించుకొని ఉన్న ఫోటో ఎన్టీఆర్ మరియు చరణ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఐతే ఈ ఫోటో గమనిస్తే కొన్ని ఆసక్తికర అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. వీరిద్దరూ ఒకే రకమైన కాస్ట్యూమ్ లో ఉన్న నేపథ్యంలో ఓ ఫైట్ లేక సాంగ్ షూట్ కోసం ఇలా రెడీ అయ్యి ఉండవచ్చు. ఆ కాస్ట్యూమ్స్ తీరు చూస్తుంటే సాంగ్ కోసమే అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్స్ గా ఉన్న ఎన్టీఆర్, చరణ్ ఓ సాంగ్ కి కలిసి స్టెప్స్ వేస్తే చూడాలని ఎప్పటి నుండో ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఆర్ ఆర్ ఆర్ ద్వారా రాజమౌళి అలాంటి క్రేజీ థింగ్ ఏమైనా ప్లాన్ చేశాడేమో అనిపిస్తుంది. మరి ఇది పీరియాడిక్ మూవీ కాబట్టి ఆ సాంగ్ నేపథ్యం, బీట్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికర అంశం. మరి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ఇంకా చాలా రోజులు వేచి ఉండాల్సిందే.

సంబంధిత సమాచారం :

X
More