ఆ సాంగ్ నాకు ఎంతో స్పెషల్, ఎప్పటికీ మెమొరబుల్ – మాస్ మహారాజా రవితేజ

ఆ సాంగ్ నాకు ఎంతో స్పెషల్, ఎప్పటికీ మెమొరబుల్ – మాస్ మహారాజా రవితేజ

Published on Dec 31, 2022 1:06 AM IST

మెగాస్టార్ చిరంజీవితో యువ దర్శకుడు బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ స్థాయిలో తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు వాల్తేరు వీరయ్య నుండి ఇటీవల రిలీజ్ అయిన మూడు సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకోగా నేడు పూనకాలు లోడింగ్ అనే మాస్ సాంగ్ ని హైదరాబాద్ సంధ్య థియేటర్ లో గ్రాండ్ గా ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేసారు మేకర్స్. మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా అద్భుతంగా డ్యాన్స్ చేసిన ఈ లిరికల్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కాగా ఈ సాంగ్ పై కొద్దిసేపటి క్రితం మాస్ మహారాజా రవితేజ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందిస్తూ ఒక పోస్ట్ చేసారు. పూనకాలు లోడింగ్ సాంగ్ తన సినీ కెరీర్ లో ఎంతో స్పెషల్ అని, అలానే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేసిన ఈ సాంగ్ ఎప్పటికీ మెమొరబుల్ గా తన లైఫ్ లో నిలిచిపోతుందని ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు