ఆ స్టార్ డైరెక్టర్ తరువాత సినిమా ఎన్టీఆర్ తోనే ?

Published on Aug 16, 2018 8:21 am IST

డైలాగ్ రైటర్ నుండి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు కొరటాల శివ. ఇప్పుడు స్టార్ హీరోలందరూ ఆయనతో సినిమా చెయ్యటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. కొరటాల కూడా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంద‌ని తెలుస్తోంది.

కొరటాల మెగాస్టార్ కోసం మంచి కమర్షియల్ అంశాలుతో కూడిన ఓ సోషల్ మెసేజ్ సబ్జెక్ట్ ను రెడీ చేస్తున్నారట. ప్రతి సినిమాతో ఏదొక మెసేజ్ ఇచ్చే కొరటాల ఈ సినిమాలో కూడా అలాంటి స్ట్రాంగ్ మెసేజ్ నే ఇవ్వనున్నాడు.

కాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ తో సినిమా త‌ర్వాత కొర‌టాల శివ ఎన్టీయార్‌ తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారట. 2020లో ఈ చిత్రం మొదలవనుందని ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పాయింట్ ను ఎన్టీఆర్ కి వినిపించాడని, ఆయనకు బాగా నచ్చిందని తెలుస్తోంది. ఐతే ఇంకా ఈ చిత్రానికి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :

X
More