ఆ ఇద్దరు హీరోలు ఈ శుక్రవారం వస్తున్నారు !

మలయాళంలో విజయవంతమైన 2 కంట్రీస్‌ సినిమాను అదే పేరుతో రీమేక్ చేసి ఈ నెల 29 న విడుదల చేస్తున్నారు. మహాలక్ష్మి ఆర్ట్స్‌ బ్యానర్‌పై పొడక్షన్‌ నెం.2గా రూపొందిన ఈ సినిమా లో సునీల్ హీరోగా నటించాడు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించారు. మనీషా రాజ్ హీరొయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మాయావన్. కొన్నిరోజుల క్రితం తమిళ్ లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాను ప్రాజెక్ట్ జెడ్ పేరుతో ఈ నెల 29 న విడుదల చెయ్యబోతున్నారు. సక్సెస్ లో లేని సునీల్, సందీప్ కిషన్ ఈ సినిమాతో విజయం సాదించాలని కోరుకుందాం.