అఖిల్ సినిమాపై అది ఒట్టి రూమర్ మాత్రమే.!

Published on May 23, 2021 10:00 pm IST

అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని తన మొదటి సినిమా నుంచి కూడా సరైన విజయం అందుకోకపోయినా నెక్స్ట్ సినిమాకు సాలిడ్ బిజినెస్ చేసుకోగలిగే స్థాయికి ఎదిగాడు. మరి అలా తాను ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలతో సిద్దమవుతున్నాడు. అయితే వాటిలో టాలెంటెడ్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” కూడా ఒకటి.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై ఎప్పటి నుంచో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే గత కొంత కాలం నుంచి ఈ చిత్రం నేరుగా ఓటిటిలో విడుదల అవుతుంది అని టాక్ వైరల్ అవుతుండగా అది అంతా ఒట్టి రూమర్ మాత్రమే అని తెలుస్తుంది.

ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటిటిలో విడుదల కాదని కేవలం థియేటర్స్ లోనే విడుదల అవుతుందని ఖరారు అయ్యింది. సో అఖిల్ సినిమాపై అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా బన్నీ వాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :