“RRR” నుంచి తారక్ ట్రీట్ పై అది రూమర్ మాత్రమే.!

“RRR” నుంచి తారక్ ట్రీట్ పై అది రూమర్ మాత్రమే.!

Published on May 7, 2021 4:00 PM IST

ప్రస్తుత ఇండియాస్ మోస్ట్ ప్రిస్టేజియస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మరి ఈ భారీ చిత్రం నుంచి ఒక్కొక్కరి బర్త్ డే గిఫ్ట్ గా అదిరే ట్రీట్ ఇస్తూ వస్తున్నారు. మరి అలా గత నెలలో చరణ్ చేస్తున్న అల్లూరి సీతారామరాజు పోస్టర్ ను విడుదల చేసి ట్రీట్ ఇచ్చారు.

ఇక ఈ మే నెలలో తారక్ పుట్టినరోజు సందర్భంగా కూడా సాలిడ్ ట్రీట్ రెడీగా ఉంది. కానీ అదే రోజున పోస్టర్ తో పాటు టీజర్ కూడా వస్తుంది గాసిప్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజమూ లేనట్టుగా తెలుస్తుంది. ఆరోజుకి జస్ట్ కొమరం భీం లా సరికొత్త అవతార్ లో పోస్టర్ వస్తుంది తప్పితే ఎలాంటి టీజర్ ను మేకర్స్ ప్లాన్ చెయ్యలేనట్టు తెలుస్తుంది. సో రెండు అప్డేట్స్ ఉంటాయి అన్నది జస్ట్ రూమర్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు