ఈ తరం హీరోలలో ఆ రికార్డు ఎన్టీఆర్ కొట్టనున్నాడా?

Published on Aug 6, 2020 7:37 am IST

ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగల నటుడు ఎన్టీఆర్. ఇక అద్భుతమైన డైలాగ్ డెలివరీ, డాన్స్ లు ఎక్సట్రా క్వాలిటీలు. కాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తుండగా, ఆయన తన నటనతో మాయ చేయడం ఖాయం అంటున్నారు. అత్యంత బలమైన పాత్ర ఎన్టీఆర్ లోని నైపుణ్యాలను వెలికి తీసేదిగా ఉంటుందట.

కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ ఆరు గెటప్స్ కనిపిస్తాడన్న ఓ న్యూస్ ఆసక్తి రేపుతోంది. శత్రువులను మట్టికరిపించడానికి, తప్పుదోవ పట్టించడానికి ఎన్టీఆర్ వివిధ వేషధారణలతో కనిపిస్తారట. మరి ఇదే కనుక నిజం అయితే నేటి తరం హీరోలలో ఆ ఫీట్ చేసిన హీరోగా ఎన్టీఆర్ నిలవనున్నాడు. ఈ తరం స్టార్ హీరోలెవరు ఒక సినిమాలో అన్ని గెటప్స్ ట్రై చేయలేదు. మరి మొదటిసారి అది ప్రయత్నించి, అందరికీ స్ఫూర్తిగా ఎన్టీఆర్ నిలువనున్నారు.

సంబంధిత సమాచారం :

More