‘దోచేయ్’కి యమగండంలా మారిన ‘ది అవెంజర్స్’

‘దోచేయ్’కి యమగండంలా మారిన ‘ది అవెంజర్స్’

Published on Apr 22, 2015 3:24 PM IST

Dochay
ప్రపంచం మొత్తంలో భాషా భేదం లేకుండా అన్ని సినిమాలు చూసి, సినిమా బాగుంటే చాలు సూపర్ హిట్ చేసే ఆడియన్స్ ఒక్క తెలుగు వారే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టాలీవుడ్ లానే మిగతా సినీ ఇండస్ట్రీస్ కూడా పర భాషా సినిమాలను బాగానే ఆదరిస్తాయి, అందుకే హాలీవుడ్ సైతం ఈ మధ్య తమ మార్కెట్ కంటే ఇండియన్ మార్కెట్ పైనే ఆసక్తి చూపుతోంది. అందుకే ఈ మధ్య హాలీవుడ్ సినిమాలను అక్కడికంటే ఇక్కడే ముందు రిలీజ్ చేస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే హాలీవుడ్ తో పాటు ఇండియాలో కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘ది అవెంజర్స్ – ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’. ఈ సినిమా హాలీవుడ్లో మే 1న రిలీజ్ అవుతున్నా, ఇండియాలో మాత్రం ఒక వారం ముందుగా ఏప్రిల్ 24న రిలీజ్ అవుతోంది. ఇండియాలోని మేజర్ సిటీలలో, మల్టీ ప్లెక్సుల్లో అంతా ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంది. బుకింగ్ ఓపెన్ అయిన కొద్ది సేపట్లోనే టికెట్స్ హాట్ కేక్స్ లా అయిపోతున్నాయి. ఈ సినిమాకున్న క్రేజ్ వల్ల మల్టీ ప్లెక్స్ వారు ఈ వీకెండ్ ఎక్కువ అవెంజర్స్ కి ఎన్ని కుదిరితే అన్ని షోలు వేస్తున్నారు.

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్, డిమాండ్ వల్ల అదే రోజున రిలీజ్ అవుతున్న తెలుగు సినిమా ‘దోచేయ్’కి పెద్ద యమగండంలా తయారైంది. యమగండం అని ఎందుకు అన్నాను అంటే ది అవెంజర్స్ వల్ల మొదటి వీకెండ్ మల్టీప్లెక్స్ మరియు మేజర్ సిటీలలో దోచేయ్ కి బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ పై తీవ్రమైన ప్రభావం ఉంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. నాగ చైతన్య – కృతి సనన్ జంటగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో రానున్న ‘దోచేయ్’ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది కానీ ఈ క్రేజీ హాలీవుడ్ సినిమా వల్ల కలెక్షన్స్ కి ఎఫెక్ట్ మాత్రం తప్పదని అంటున్నారు. మరి ట్రేడ్ పండితులు అంటున్నది ఎంత వరకూ నిజమవుతుందనేది ఏప్రిల్ 24 డిసైడ్ చేస్తుంది.

తాజా వార్తలు