మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటికి ముందు తాను చేసిన గ్లోబల్ సెన్సేషనల్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”తో తాను గ్లోబల్ లెవెల్లో మంచి ఫేమ్ ని అందుకున్నాడు. ఇలా అనేకమంది హాలీవుడ్ నటులు దర్శకులు కూడా తారక్ పై కామెంట్స్ చేయడం జరిగింది.
మరి లేటెస్ట్ గా హాలీవుడ్ భారీ హిట్ చిత్రం ‘బ్లాక్ పాంథర్’ నటుడు మైఖేల్ బీ జోర్డాన్ ఎన్టీఆర్ పై తన సిన్నర్స్ ప్రమోషన్స్ లో మాట్లాడ్డం జరిగింది. ఇలా తనకి ఎన్టీఆర్ కి మధ్య ఆ మధ్య ఆస్కార్స్ లో జరిగిన మాటలు తాను రివీల్ చేసాడు. జూనియర్ ఎన్టీఆర్ ని ఆస్కార్స్ సమయంలో ఓ సారి కలిసాను అతనికి బాస్కెట్ బాల్ ఆడటం అంటే ఎంతో ఇష్టం అని బ్లాక్ పాంథర్ నటుడు షేర్ చేసుకోవడం ఇపుడు మంచి ఆసక్తిగా మారింది. దీనితో తన కామెంట్స్ ఇపుడు ఎన్టీఆర్ అభిమానుల్లో వైరల్ గా మారాయి.