ప్రముఖ నటుడు కుమారుడిపై కేసు నమోదు

Published on Jun 7, 2019 3:00 am IST

విలక్షణ నటుడు ఆహుతి ప్రసాద్ తెలుగు సినిమాలలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా,కమెడిన్ గా ఆయన దశాబ్దాలపాటు చిత్రసీమలో రాణించారు. ఆయన ‘ఆహుతి’ సినిమాలో చేసిన పాత్రకు మంచి పేరు రావడంతో ఆహుతి ప్రసాద్ గా ఇండస్ట్రీలో ఆయన పేరు స్థిరపడిపోయింది. ఆ మధ్య ఆహుతి ప్రసాద్ హఠాత్మరణం పొందారు.

తాజాగా ఆహుతి ప్రసాద్ కొడుకు కార్తీక్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయ్యినట్లు సమాచారం.జాతీయగీతం ప్రదర్శన సమయంలో నిలబడని కార్తీక్ ప్రసాద్..ఈ విషయంపై ప్రశ్నించిన వ్యక్తిని తిట్టడమే కాకుండా..దౌర్జన్యం చేసినట్లు బాధితుడి ఆరోపణ. ఈ విషయంపై పూర్వాపరాలు తెలియాల్సి ఉంది .

సంబంధిత సమాచారం :

More