కోలీవుడ్ సినిమా నుంచి ఈ ఏడాది రిలీజ్ కి రానున్న పలు అవైటెడ్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ సినిమా జైలర్ 2 కూడా ఒకటి. రీసెంట్ గానే ఈ సినిమా తాలూకా విడుదల తేదీని మేకర్స్ అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్ గా అనౌన్స్ చేశారు.
సో దసరా రేస్ లో తలైవర్ ఆగమనం కన్ఫామ్ అయ్యింది కానీ దానికి ముందే స్టార్ నటుడు ధనుష్ నటిస్తున్న ఓం- చాప్టర్ 1 ని కూడా అక్టోబర్ 16 కి లాక్ చేసి అనౌన్స్ చేశారు. అయితే తర్వాత జైలర్ 2 ప్రకటన రావడంతో ధనుష్ వెనక్కి తగ్గుతాడు అని అంతా అనుకున్నారు కానీ ధనుష్ అలాంటివి లేదని క్లియర్ చేసాడు.
లేటెస్ట్ గా బాలీవుడ్ వెర్సటైల్ నటుడు నజీరుద్దీన్ షాహ్ తమ సినిమాలోకి వచ్చినట్టు ఇచ్చిన అప్డేట్ తో పాటుగా సినిమా రిలీజ్ అక్టోబర్ 16నే అని క్లియర్ గా ప్రకటించారు. సో రజినీ వర్సెస్ ధనుష్ క్లాష్ ఇంకా ఆన్ లోనే ఉందని చెప్పవచ్చు. మరి రిలీజ్ దగ్గరకి వచ్చేసరికి ఏమన్నా మారుతాయేమో చూడాలి.
A strong addition to the world of #OM 🔥
The veteran #NaseeruddinShah on board the mega biggie. Coming to cinemas worldwide on October 16th 2026.@dhanushkraja @mammukka @Rajkumar_KP @wunderbarfilms @RTakeStudios @Sai_Pallavi92 @sreeleela14 @SaiAbhyankkar @Shra2309 @azy905… pic.twitter.com/S3clQ2fCb2
— Wunderbar Films (@wunderbarfilms) July 9, 2026


