స్కూల్ కట్టిస్తోన్న క్రియేటివ్ డైరెక్టర్ !

Published on Aug 3, 2020 9:58 am IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన పెద్ద మనసును చాటుకున్నారు. మొన్న ఉదయం మట్టపర్రు గ్రామంలో సుకుమార్ గారు తన తండ్రిగారు అయిన బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు గారు పేరు మీద మండల ప్రజా పరిషత్ ప్రాధమిక ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు అంతస్తుల పాఠశాల భవనం నిర్మాణం చేయుటకు నిర్ణయం తీసుకున్నారు.

దీనికి అయ్యే ఖర్చు సుమారుగా 14 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తన పెద్ద అన్నయ్యగారు అయిన శ్రీ బండ్రెడ్డి వెంకటేశ్వర రావు గారు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తోన్న సినిమా ‘పుష్ప’. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా క్యూట్ బేబీ రష్మిక మందన్న నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. బన్నీ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకోవాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :