తమిళ విలన్స్ ని ఓ ఆటాడుకున్న రవితేజ

Published on Feb 22, 2020 8:20 am IST

ఈ మధ్య రవితేజ టైమ్ ఏం బాగాలేదు. ఆయనకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఎన్నో ఆశలు మధ్య విడుదలైన డిస్కో రాజా సైతం ఆయనకు హిట్ ఇవ్వలేక పోయింది. దీనితో తనకు కలిసొచ్చిన, హిట్ ఇచ్చిన దర్శకుడు గోపి చంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ మూవీ చేస్తున్నాడు. కాగా ఈ చిత్ర టీజర్ నిన్న శివరాత్రి కానుకగా విడుదల చేశారు. పోలీస్ గా రవితేజ తన మార్కు మేనరిజంతో ఇరగదీశాడు. నిమిషానికి పైగా ఉన్న టీజర్ రవి తేజ ఎనర్జీ, అదిరిపోయే యాక్షన్ తో సాగింది.

ఐతే టీజర్ లో ఇద్దరు నటులు ప్రత్యేకంగా నిలిచారు. తమిళ నటులైన సముద్ర ఖని, వరలక్ష్మి ఈ చిత్రంలో విలన్స్ గా నటిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ఒంగోలులో రౌడీయిజం సాగిస్తున్న ఈ ఇద్దరి ఆట కట్టించే పోలీస్ గా రవితేజ కనిపిస్తాడు అనిపిస్తుంది. పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రలకు పెట్టింది పేరైన వరలక్ష్మీ ఓ రేంజ్ లో తెరపై పేలడం ఖాయం కనిపిస్తుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మే 8న క్రాక్ గ్రాండ్ గా విడుదల కానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More