‘ఘాజి, అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100, కేర్ అఫ్ కంచెరపాలం’ శైలిలో తాజాగా ఇప్పుడు మరో చిత్రం కొత్త కథతో తో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
నూతన నటీనటులతో మధుసూదన్ దర్శకత్వంలో మ్యాజిక్ లైట్స్ స్టూడియోస్ మరియు వర్షి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఎమ్ వి రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “ది ఫాగ్” . ఈరోజు ఈ చిత్రానికి సంబందించిన మొదటి ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతులమీదుగా విడుదల చేసారు.
ఈ సందర్భం గా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ “ఎమ్ వి రెడ్డి నిర్మాతగా మధుసూదన్ దర్శకత్వం లో వస్తున్నా సినిమా “ది ఫాగ్”. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడే చూసాను. సినిమా చాలా కొత్తగా ఉంది. కొత్త కెమెరా తో ఎటువంటి లైట్స్ లేకుండా కొత్త లొకేషన్స్ లో సున్న ఉష్ణోగ్రత లో హాలీవుడ్ స్టైల్ లో తీశారు. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా దర్శుకుడు మధుసూదన్ కెరీర్ కి మరియు తెలుగు సినిమా కి మంచి మలుపు అవుతుంది” అని కోరుకున్నారు.


