సమీక్ష : “ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)” – కొన్ని చోట్ల ఆకట్టుకునే సర్వైవల్ డ్రామా!

సమీక్ష : “ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)” – కొన్ని చోట్ల ఆకట్టుకునే సర్వైవల్ డ్రామా!

Published on Mar 29, 2024 3:04 AM IST
The Goat Life Movie Review in Telugu

విడుదల తేదీ : మార్చి 28, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, జిమ్మీ జీన్-లూయిస్, KR గోకుల్, తాలిబ్ అల్ బలూషి మరియు రిక్ అబీ తదితరులు

దర్శకుడు: బ్లెస్సీ

నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్-లూయిస్, స్టీవెన్ ఆడమ్స్

సంగీత దర్శకులు: ఏ ఆర్ రెహమాన్

సినిమాటోగ్రాఫర్‌: సునీల్ కె.ఎస్‌

ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బ్లేస్సి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆడు జీవితం. తెలుగులో ఈ సినిమా ఈ రోజు విడుద‌లైంది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. తన ఫ్రెండ్ సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించుకుని రావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నజీబ్ దొంగవీసా మీద దుబాయ్ వెళ్తాడు. దీంతో, అక్కడ నజీబ్ ఓ ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్ ను బలవంతంగా గొర్రెలు కాయడానికి ఓ ఎడారిలో తీసుకువెళ్ళి పడేస్తారు. ఆ ఎడారి నుంచి తప్పించుకోవడానికి నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు?, తిరిగి తన కుటుంబం దగ్గరకి చేరుకోవడానికి ఎన్ని అవరోధాలు దాటాడు ?, ఈ మధ్యలో నజీబ్ ఎలా మారిపోయాడు?, అతని రూపం ఎలా అయిపోయింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

చదువు, అవగాహన లేకుండా దొంగ వీసాల పై దుబాయ్ వెళ్లేవారి జీవితాలు అక్కడ ఎలా ఉంటాయి ?, ఎంత దయనీయ స్థితిలో వారి బతుకులు మారిపోతాయి? లాంటి వాస్తవ పరిస్థితులను వెండితెరపై ఆవిష్కృతం చేయడానికి దర్శకుడు బ్లెస్సీ తీసుకున్న జాగ్రత్తలు.. ముఖ్యంగా ఎడారి నేపథ్యం దగ్గరనుంచీ.. అక్కడ పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు దుబాయ్ సన్నివేశాలను చూపించిన విధానం.. అలాగే హీరోహీరోయిన్ల మధ్య ఏమోషన్ని.. ఇలా ప్రతిది బ్లెస్సీ చాల చక్కాగా ఎస్టాబ్లిష్ చేశాడు.

పృథ్వీరాజ్ సుకుమారన్ జర్నీ తాలూకు సన్నివేశాలు, అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి. ఇక ఎడారి నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించుకునే సీన్స్.. అదే విధంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఎమోషనల్ గా బాగానే కనెక్ట్ అవుతాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ నటన కూడా అద్భుతంగా ఉంది. తన హావభావాలతో ఆయన చక్కగా నటించాడు. హీరోయిన్ గా అమలా పాల్ ఆకట్టుకుంది. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన జిమ్మీ జీన్-లూయిస్, KR గోకుల్, తాలిబ్ అల్ బలూషి మరియు రిక్ అబీ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

ఈ ఆడు జీవితం కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు బ్లెస్సీ, మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు బ్లెస్సీ మాత్రం వాటిని సింపుల్ గా నడిపారు. అలాగే సినిమాని ఎక్కువగా బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్ తో డ్రైవ్ చేశాడు.

పైగా సినిమాలోని మెయిన్ ఎమోషన్ని కూడా అంతే ఎఫెక్టివ్ గా ఎలివేట్ చేయలేక పోయాడు. మధ్య మధ్యలో అనవసరమైన ల్యాగ్ సీన్స్ తో నిరాశ పరిచారు. పైగా ఈ ఆడు జీవితం సినిమాలో ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకోవు. ఓవరాల్ గా కీలక సీన్స్ బాగానే ఉన్నా కథనాన్ని మాత్రం ముందుకు నడిపించవు. ఆ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది. మొత్తానికి స్లో నరేషన్ తో బోరింగ్ సీన్స్ తో ఈ చిత్రం సాగింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం బాగుంది. సునీల్ కె.ఎస్‌ సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజువల్ రొమాన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు బ్లెస్సీ స్క్రిప్ట్ లో ల్యాగ్ లేకుండా చూసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.

తీర్పు :

దొంగ ఏజెంట్ల ద్వారా దుబాయ్ కి వెళ్లి మోసపోయిన నజీబ్, మళ్లీ తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో జరిగిన జర్నీ.. ఎమోషనల్ గా కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంది. అలాగే సినిమాలోని టేకింగ్, నటీనటుల నటన బాగున్నాయి. అయితే, స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం వంటి అంశాలు సినిమాకి బలహీనతలు గా నిలుస్తాయి. కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ తన నటనతో చాలా బాగా మెప్పించాడు. కాకపోతే, సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

విడుదల తేదీ : మార్చి 28, 2024 123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5 నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, జిమ్మీ జీన్-లూయిస్, KR గోకుల్, తాలిబ్ అల్ బలూషి మరియు రిక్ అబీ తదితరులు దర్శకుడు: బ్లెస్సీ నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్-లూయిస్, స్టీవెన్ ఆడమ్స్ సంగీత దర్శకులు: ఏ ఆర్ రెహమాన్ సినిమాటోగ్రాఫర్‌: సునీల్ కె.ఎస్‌ ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్ సంబంధిత లింక్స్: ట్రైలర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో...సమీక్ష : "ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)" - కొన్ని చోట్ల ఆకట్టుకునే సర్వైవల్ డ్రామా!