ప్లాస్టిక్ సర్జరీ తో అందం కోల్పోయిన హీరోయిన్

Published on Jun 7, 2019 3:58 am IST

టీవీ నటిగా మంచి గురింపు తెచ్చుకున్న నటి మౌని రాయ్ ఆ పాపులారిటీ తో చిత్ర పరిశ్రమలో కూడా ఆకాశాలు పొందుతూ దూసుకుపోతుంది. అలాంటి మౌని రాయ్ తనకున్న అసలు సౌందర్యం చాలదన్నట్టు ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉన్న అందాన్ని పోగొట్టుకుంది. సహజ సౌందర్యాన్ని వదిలేసి కృత్రిమ సౌందర్యం కోసం పాకులాడిన కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీని ఏలినా. చాలామంది హీరోయిన్లు తమ అందాన్ని శాశ్వతంగా కోల్పోయిన విషయం తెలిసిందే.

ఇటీవల మౌనిరాయ్ తన అందాన్ని మెరుగుపరుచుకునేందుకు పలు సర్జరీలు చేయించుకున్న అనంతరం ఓ ఈవెంట్లో ఆమెను చుసిన జనాలు చూసి షాక్ ఐయ్యారట. సహజ సౌందర్యంతో గతంలో ఏంజల్ లా కనిపించిన మౌనిరాయ్ ముఖంలోని మెరుపు ప్లాస్టిక్ సర్జరీ కారణంగా నాశనమైందని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఇటీవల జాన్ అబ్రహం హీరో గా వచ్చిన ‘రోమియో అక్బర్ వాల్టర్, మూవీ లో కనిపించిన మౌని రాయ్ ప్రస్తుతం మేడ్ ఇన్ చైనా, బ్రహ్మాస్త్ర, మొఘల్ చిత్రాలలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More