గ్లోబల్ వైడ్ గా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన ప్రస్థానాన్ని చాలా బలంగా కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మాట్ డామన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం.. విడుదలైన మొదటి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా 264 మిలియన్ డాలర్లకుపైగా రాబట్టింది.
అంటే, భారత కరెన్సీలో చూసుకుంటే.. ‘ది ఒడిస్సీ’ చిత్రం దాదాపు రూ.2,548 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఒక్క భారత్ విషయానికి వస్తే.. భారత్ లో ‘ది ఒడిస్సీ’ చిత్రం తొలిరోజు రూ.20.76 కోట్లు వసూళ్లను రాబట్టింది. మొత్తానికి దర్శకుడు నోలన్ కెరీర్లోనే ఈ సినిమాకి ఓపెనింగ్స్ అత్యుత్తమ ఓపెనింగ్ కావడం విశేషం. హోమర్ రాసిన ‘ది ఒడిస్సీ’ ఇతిహాసం ఆధారంగా క్రిస్టఫర్ నోలన్ ఈ సినిమాని తీశారు. భారత్ లో చిత్రబృందం ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే.
