కాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకం కానీ,శృంగారాని కాదు- రాహుల్ రవీంద్ర

Published on Jun 19, 2019 12:00 am IST

దర్శకుడుగా మారిన నటుడు రాహుల్ రవీంద్ర సింగర్ చిన్మయి శ్రీపాద భర్తన్న విషం తెలిసిందే. సింగర్ చిన్మయి తమిళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో ప్రకంపనలు పుట్టించింది. ఆమె ఇండస్ట్రీలోని ఓ రచయితపై, అలాగే కొందరు నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా వలే తమిళ పరిశ్రమలో ఈమెకూడా మీ టూ తరహా ఉద్యమం నడిపారు. అప్పుడు ఈమె చర్యలను కొందరు సమర్థిస్తే, కొందరు తప్పుపట్టారు.

ఇటీవల విడుదలైన “మన్మథుడు2” సినిమా టీజర్ రిలీజైనప్పటి నుండి, సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఈమెపై ఎదురుదాడికి దిగారు. టీజర్ లో నాగార్జున అలాగే కొందరు అమ్మాయిల మధ్య నడిచే శృంగార సన్నివేశాలను ఉద్దేశిస్తూ, ఈ తరహా సన్నివేశాలు మీరు సమర్థిస్తారా…?అంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై చిన్మయి భర్త రాహుల్ రవీంద్ర స్పందించారు. అసలు కాస్టింగ్ కౌచ్ కి “మన్మధుడు 2” సినిమాకి సంబంధం ఏమిటి, మేము లైంగింక వేధింపులకు వ్యతిరేకం కానీ,శృంగారానికి కాదు అని బదులిచ్చారు.

సంబంధిత సమాచారం :

X
More