అడ్వాన్స్ బుకింగ్‌ లతో అదరగొడుతున్న ‘ది రాజాసాబ్’ !

The-Raja-Saab

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో చేసిన ‘ది రాజాసాబ్’(The Raja Saab) సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ సినిమాకి విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు బలంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర అమెరికాలో ఇప్పటివరకూ 17,500కు పైగా ఈ చిత్రం టిక్కెట్లు అమ్ముడయాయి. అటు యూకే మార్కెట్‌లో కూడా ఇప్పటివరకు ప్రీ-సేల్స్‌లో 17,500కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. జనవరి 8, 2026న ప్రారంభమయ్యే ప్రీమియర్ షోలకు ముందు ఈ అడ్వాన్స్ బుకింగ్‌ లతో మొత్తానికి మంచి ఆరంభాన్ని సూచిస్తున్నాయి.

కాగా మారుతి మూడు సంవత్సరాలు కష్టం ఈ సినిమా చేశారు. పైగా సినిమాలో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉండబోతుంది. అందుకే, ప్రభాస్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ కథానాయికలు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అన్నట్టు ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Exit mobile version