మహేష్ సినిమాలో ‘శిల్పా శెట్టి’ పాత్ర అదే !

Published on May 17, 2021 12:01 am IST

‘సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘శిల్పా శెట్టి’ నటిస్తోందని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. త్రివిక్రమ్ రాసుకున్న కథలో శిల్పా శెట్టి క్యారెక్టర్ కి మహేష్ క్యారెక్టర్ కనెక్షన్ ఏమిటంటే.. మహేష్ కి ఆమె పిన్నిగా కనిపించబోతుందట.

మొత్తానికి త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్‌ ని పెడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే నదియా, ఖుష్బూ, దేవయాని, టబు, ఇప్పుడు శిల్పా శెట్టి. ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది. ఇక పదకుండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తరువాత త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా కాబట్టి, ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :