ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ ఈ సారి డిఫ్రెంట్ గా ట్రై చేస్తున్నాడు !

Published on Mar 8, 2019 12:10 am IST

తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 తోసెన్సేషనల్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ చిత్రం తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న ఈ డైరెక్టర్ తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తన రెండవ సినిమాను చేయనున్నాడు అజయ్. ఈ చిత్రం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందట. ఈ చిత్రానికి మహా సముద్రం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. మరి అజయ్ భూపతి ఈ చిత్రం తో కూడా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :